సింగర్ అవతారం ఎత్తనున్న 'సల్మాన్'
Send us your feedback to audioarticles@vaarta.com
పుల్వామా తీవ్రవాద దాడి.. తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రయిక్.. ఇలా భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పాకిస్థాన్ కళాకారులను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన జహీర్ ఇక్బాల్ డెబ్యూ ఫిల్మ్ 'నోట్ బుక్' చిత్రంలోలో 'మై తారే...' పాటను పాక్ సింగర్ అతిఫ్ అస్లమ్ చేత పాడించి రికార్డ్ చేయించారు.
అయితే పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఆ పాటను మళ్లీ రికార్డ్ చేయబోతున్నారు. ఎవరితో పాట పాడించాలని నిర్మాతలు యోచించి.. నిర్మాతల్లో ఒకరైన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌తో పాట పాడించాలనుకుని ఆయన్ని ఒప్పించారు.
ఇంతకు 'హీరో' చిత్రంలో 'మై హు హీరో తేరా.. ' పాట పాడిన సల్మాన్ మరోసారి త్వరలోనే తన గొంతును సవరించుకోనున్నారు. 'నోట్ బుక్' చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments