భాయ్ ని నమ్ముకుంటే 'జీ'కి దెబ్బ పడిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సల్మాన్ ఖాన్, దిశా పటాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ రాధే. ప్రభుదేవా దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రంజాన్ కానుకగా మే 13 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఇండియాలో కోవిడ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్ సాధ్యపడలేదు. దీనితో నేరుగా ఓటిటి, డిజిటల్, డిటిహెచ్ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేశారు.
Also Read: పిక్ టాక్: నెట్టింట కాక రేపుతున్న మనోజ్ హీరోయిన్
ఈ హక్కులని జీ స్టూడియో సంస్థ దాదాపు రూ 230 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. జీ సంస్థ తన ఆన్లైన్ వేదికలలో, డిటిహెచ్ లో పే పర్ వ్యూ నిబంధనతో రాధే చిత్రాన్ని విడుదల చేసింది. విదేశాల్లో మాత్రం థియేటర్స్ లో రాధేని విడుదుల చేశారు. అక్కడ సల్లూ భాయ్ చిత్రానికి నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది.
సినిమా ప్రేక్షకులని ఇంప్రెస్ చేయలేకపోవడంతో జీకి నష్టాలు తప్పేలా లేవని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. జీ సంస్థ ప్రతినిధులు రాధే చిత్రానికి అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయని, రెవెన్యూ ఎంకరేజింగ్ గా ఉందని దాటవేశారు.
కానీ 4.2 మిలియన్ వ్యూస్ ఉన్నంత మాత్రాన రెవెన్యూ ఆస్థాయిలో ఉండదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీలో ఒకే టికెట్ పై డిటిహెచ్ లో మూవీ చూసేస్తారు. బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్న గణాంకాల ప్రకారం జీ సంస్థ 60 నుంచి 80 కోట్ల వరకు వెనుకబడి ఉందని, నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. పైరసీ ప్రభావం ఎలాగూ ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com