'బ్యాడ్‌బాయ్‌' పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, అమ్రిన్ ఖురేషి తారాగ‌ణంగా రాజ్‌కుమార్ సంతోషి రూపొందిస్తోన్న చిత్రం ‘బ్యాడ్‌బాయ్‌’. డా.జ‌యంతీలాల్ గ‌డ‌(పెన్‌), ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప‌తాకాలు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ విడుద‌ల చేస్తుంది. ప్ర‌తి సినిమాను రాజ్‌కుమార్ సంతోషి ఓ సెల‌బ్రేష‌న్‌లా తెర‌కెక్కిస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే. గ‌త ముప్పై ఏళ్లుగా గ్లోబెల్ సినిమాలో ఇండియ‌న్ చిత్రాల గొప్ప వ‌రుస‌లో ఆయ‌న రూపొందించిన చిత్రాలున్నాయి. ఆయ‌న రూపొందించిన మ‌రో ఐకాన్ మూవీగా బ్యాడ్‌బాయ్ పోస్ట‌ర్‌ను బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ విడుద‌ల చేశారు.

2020లో రూపొందుతోన్న బాలీవుడ్ మ‌సాలా చిత్రంగా బ్యాడ్‌బాయ్ రూపొందుతోందని, ఎంజాయ్‌మెంట్‌, ఫన్ అంశాల‌తో సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్క‌తోంద‌ని నిర్మాత‌లు తెలిపారు. రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన సినిమాల‌న్నింటిలో బ్యాడ్‌బాయ్ చిత్రం చాలా మంచి స్క్రిప్ట్‌, కొత్త హీరో హీరోయిన్స్‌, గొప్ప సంగీతం, డ్రామా త‌దిత‌ర అంశాల‌తో తెరకెక్కింది. ఈ సినిమా పోస్ట‌ర్‌లో బ్యాడ్ బాయ్‌గా న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, బ్యాడ్ గ‌ర్ల్ పాత్ర‌లో అమ్రిన్ ఖురేషి క‌నిపిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. పోస్ట‌ర్ చూస్తుంటే రాజ్‌కుమార్ సంతోషి మార్క్ మాస్ట‌ర్ పీస్‌లా అనిపిస్తుంది. రాజ్‌కుమార్ సంతోషి నుండి వ‌స్తున్న మ‌రో సూప‌ర్‌హిట్ అని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ చిత్రానికి నిర్మాత‌లు: సాజిద్ ఖురేషీ, దావ‌ల్ జ‌యంతీ లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతీ లాల్ గ‌డ‌