పెళ్లిపై సల్లుభాయ్ సిల్లీ సమాధానం!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియా మొత్తమ్మీద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. ఈయన 53 ఏళ్లు నిండినప్పటికీ ఇంతవరకూ పెళ్లి లేదు పెటాకులు లేదు!. అయితే ఈయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో పైనున్న పెరుమాళ్లకే ఎరుక. తాజాగా ఈ పెళ్లి వ్యవహారంపై కండల వీరుడు సిల్లీగా సమాధానమిచ్చారు.
ఇప్పటి వరకూ తన జీవితంలో ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందామని అడగలేదు.. అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇదిగో చూడండి ఎంత సిల్లీగా ఉందో. వాస్తవానికి ‘భారత్’ సినిమాలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్, సల్మాన్ నటించారు. ఈ చిత్రంలో కత్రినా పెళ్లి ప్రపోజల్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయట. అయితే ఇలాంటవన్నీ తనకు రీల్కే పరిమితం అవుతున్నాయని.. రియల్ లైఫ్‌లో మాత్రం జరగట్లేదని సల్లుభాయ్ చెబుతున్నాడు. అంతేకాదు.. తానెప్పుడు క్యాండిల్‌లైట్ డిన్నర్స్ చేయలేదని.. క్యాండిల్ లైట్లో ఏం తింటున్నానో కూడా చూడలేనని.. కానీ ఏ అమ్మాయి పెళ్లి ప్రపోజల్ తీసుకురాలేదని మాత్రం బాధపడుతున్నానని సిల్లీగా చెప్పుకొచ్చారు.
కాగా.. సల్మాన్ పలువురితో ప్రేమయాణం నడపటమే కాదు.. పలువురితో డేటింగ్ కూడా చేశారని వచ్చిన కోకొల్లలు. అయితే తాజాగా సల్లుభాయ్ సిల్లీ సమాధానానికి నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సమాధానంతో సల్లు మాజీ ప్రియురాళ్లు ఎలా ఫీలవుతారో.. ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments