సల్మాన్ ‘రాధే’ ట్రైలర్ వచ్చేసింది...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదలైంది. మాదక ద్రవ్యాలు గురించి చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. నగరంలో పెరిగిపోయిన క్రైమ్ రేటును తగ్గించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను పిలిపించడం.. సల్మాన్ ఎంట్రీ.. అక్కడ నుంచి విలన్స్‌ని సల్మాన్ మట్టుబెట్టే తీరు.. అన్నీ ఆకట్టుకునేలా ప్రభుదేవా రూపొందించారనడంలో సందేహం లేదు.
ఇక దిశా పటానీని చూపించిన తీరు అద్భుతం. చాలా అందంగా దిశ కనిపించింది. ఇప్పటికే మంచి డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రభుదేవా ఈ సినిమాను సైతం సక్సెస్ బాట పట్టిస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని సీటీమార్ పాటను ఇందులో రీమేక్ చేయడం విశేషం. ఈ పాట తెలుగులో ఎంత సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇక హిందీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ రీమేక్ గీతంలో దిశా పటానీ, సల్మాన్ వేసిన డాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గ్లామర్ బ్యూటీ, సల్మాన్ స్నేహితురాలు జాక్వలైన్ ఫెర్నాండెజ్ కూడా ఈ పాటలో సందడి చేసింది. మొత్తానికి ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ట్రైలర్‌తో అంచనాలను ప్రభుదేవా పెంచేశారనడంలో సందేహం లేదు. ఈ చిత్రం రంజాన్ పండుగ సందర్భంగా మే 13న విడుదల కానుంది. థియేటర్లతో పాటు ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్, డిష్ టీవీ, డీటుహెచ్, టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీల్లోనూ ‘రాధే’ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. 40 దేశాల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments