కిందపడేసేలోపు మూడుసార్లు కరిచింది.. పాముకాటుపై స్పందించిన సల్మాన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిన వార్తతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో సల్మాన్‌ను ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేసినట్లగా నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజీఎం (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు.
తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు సల్లూభాయ్. తన తండ్రితో కలిసి సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది... ఒక కట్టెతో దాన్ని అవతలకు విసిరేయాలనుకున్నా అని సల్మాన్ చెప్పారు. కానీ అది వెంటనే తన చేతిపైకి పాకిందని... దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు కాటేసిందని ఆయన పేర్కొన్నారు. అది విషపూరితమైన పాము అనిపించిందని.. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యానని సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే వుందని ఆయన వెల్లడించారు.
సల్మాన్ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకిని పాము కరిచిందన్న విషయం తెలియగానే ఎంతగానో భయపడిపోయామని చెప్పారు. కానీ అది మరీ విషసర్పం కాకపోవడంతో త్వరగానే కోలుకున్నాడని ఆయన తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. భయపడాల్సిన పనేమీ లేదు అని వెల్లడించారు. ఇక సల్మాన్ ఖాన్ ఈరోజు 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. త్వరలో ఆయన తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ మూవీ ద్వారా టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు సల్మాన్. అలాగే విక్టరీ వెంకటేశ్‌తో కూడా సినిమా చేయబోతున్నాడని ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments