నా కూతురి ఆత్మహత్య కేసులో సల్మాన్ ప్రమేయం ఉంది: జియాఖాన్ తల్లి
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం పలు వివాదాలకు కారణమవుతోంది. ఇప్పటికే ఆయన ఆత్మహత్య కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు వినవస్తుండా.. తాజాగా మరో నింద ఆయనపై పడింది. ప్రముఖ నటి జియా ఖాన్ కూడా సుశాంత్ లాగే 2013లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్య కేసులో సల్మాన్ జోక్యం చేసుకున్నారని జియా తల్లి రాబియా ఖాన్ ఆరోపించారు. జియా ఖాన్ ఆత్మహత్యకు ఆమె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలియే కారణమంటూ అతనిపై అప్పట్లో కేసు నమోదైంది.
ఈ కేసు విషయమై 2015లో సీబీఐను సల్మాన్ సంప్రదించి సూరజ్‌ని వేధించవద్దని కోరినట్టు జియా తల్లి ఆరోపించారు. తాను సూరజ్‌ను ‘హీరో’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నానని.. ఈ నేపథ్యంలో తాను సూరజ్‌పై భారీగా ఖర్చు పెట్టానని సల్మాన్ తెలిపినట్టు రబియా పేర్కొన్నారు. ఇదంతా తాను అప్పట్లో బాగా వైరల్ అయిన ఓ వీడియోలో చూశానని రబియా పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని తాను లండన్ నుంచి వచ్చి.. అధికారులను సంప్రదించానని ఆమె పేర్కొన్నారు. బెదిరించడం కూడా ఒకరకంగా వ్యక్తిని హత్య చేయడమేనని ఆమె పేర్కొన్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయం దేశ వ్యాప్తంగా సంచలనమవడంతో జియా తల్లి తన కూతురి మరణాన్ని గుర్తు చేసుకున్నారు.
Plz watch this guy's. She is Jiah khan's mother. Now she revealed the truth of salman khan. He is so cheap.. Salman khan ne CBI koh paisa dekhar case bandh karwa diya.. ????
— ???????????? ?? (@bankita_) June 17, 2020
Hate u salman khan.. Tera kaam khatm ab#justiceforSushanthSinghRajput#isupporttigershrof pic.twitter.com/TAEBqzlWcM
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com