చిరు 153లో సల్మాన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదట. వెంటనే తన 153వ సినిమా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని.
‘లూసిఫర్’లో మోహన్‌లాల్ హీరోగా నటిస్తే ఆ సినిమాను డైరెక్ట్ చేసిన హీరో పృథ్వీరాజే.. అందులో కీలక పాత్రలో నటించారు. మరి తెలుగులో ఆ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు సల్మాన్ పేరు వినపడుతుంది. చిరు కుటుంబంతో సల్మాన్‌కు చాలా మంచి సానిహిత్యం ఉంది. దాని వల్లనే అప్రోచ్ అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఒకవేళ ఇది నిజంగానే జరిగితే అమితాబ్ తర్వాత చిరుతో నటించే బాలీవుడ్ హీరో సల్మానే అవుతాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com