చిరు 153లో స‌ల్మాన్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌. వెంట‌నే త‌న 153వ సినిమా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నారు. ‘సాహో’ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను త‌యారు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని.

‘లూసిఫ‌ర్‌’లో మోహన్‌లాల్ హీరోగా న‌టిస్తే ఆ సినిమాను డైరెక్ట్ చేసిన హీరో పృథ్వీరాజే.. అందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. మ‌రి తెలుగులో ఆ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు స‌ల్మాన్ పేరు విన‌ప‌డుతుంది. చిరు కుటుంబంతో స‌ల్మాన్‌కు చాలా మంచి సానిహిత్యం ఉంది. దాని వ‌ల్ల‌నే అప్రోచ్ అవుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఒక‌వేళ ఇది నిజంగానే జ‌రిగితే అమితాబ్ త‌ర్వాత చిరుతో నటించే బాలీవుడ్ హీరో స‌ల్మానే అవుతాడు.

More News

సూర్య‌కు జోడీగా రాశీఖ‌న్నా

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రు(ఆకాశం నీ హ‌ద్దురా)ని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి.

నిఖిల్ పెళ్లి వాయిదా

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ విష‌యంపై ఆ హీరోనే ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు.

త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు.

మందు బాబులకు జగన్ సర్కార్ భారీ షాక్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరోసారి 3.0 పేరుతో మే-17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.