చైనాలో సల్మాన్....
- IndiaGlitz, [Tuesday,August 07 2018]
ఇండియన్ సినిమాలు ఇప్పుడు చైనా మార్కెట్‌ను ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. బాలీవుడ్ చిత్రాలకు చైనాలో ఆదరణ పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్‌లో దంగల్, హిందీ మీడియం, సూపర్‌స్టార, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలు చైనాలో మంచి వసూళ్లను రాబట్టాయి.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చైనాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 31న చైనాలో సుల్తాన్ అనే పేరుతోనే విడుదలకు సిద్ధమవుతోంది. 11 వేల స్క్రీన్స్, 40 వేల షోస్‌తో సుల్తాన్ థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. సల్మాన్ కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుల్తాన్ చైనాలో మరి ఎలాంటి కలెక్షన్స్‌ను రాబట్టుకుంటాడో చూడాలి.