బాలీవుడ్ శ్రీమంతుడికి పోటాపోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ నటించిన మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. మైతీ మూవీస్ సంస్థ నిర్మించింది. మహేష్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. అయితే ఈ సంచలన చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్...మధ్య శ్రీమంతుడు రీమేక్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనడం విశేషం. అలాగే బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, హ్రుతిక్ రోషన్ ఇద్దరూ ఈ మూవీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి చివరికి బాలీవుడ్ శ్రీమంతుడు ఎవరు అవుతారో ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com