'మేజ‌ర్‌'లో స‌ల్మాన్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Thursday,September 24 2020]

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి ముష్కరులను మట్టుబెట్టింది. ఈ దాడిలో ఎన్ఎస్‌జీ కమెండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను త్యాగం చేసి ఉగ్ర‌వాదుల చెర‌లోని శ‌ర‌ణార్ధుల ప్రాణాల‌ను కాపాడారు. ఈ రియ‌ల్ హీరో చేసిన సాహసాన్ని, ప్రాణ త్యాగాన్ని మేజ‌ర్ సినిమాగా చిత్రీక‌రిస్తున్నారు. ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడ‌విశేష్ న‌టిస్తున్నారు. గూఢ‌చారి స‌క్సెస్ త‌ర్వాత శేష్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.

హిందీ, తెలుగు భాష‌ల్లో గూఢ‌చారి ఫేమ్‌ శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మ‌హేశ్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతుంది. గూఢ‌చారిలో అడివిశేష్‌తో న‌టించిన శోభితా ధూళిపాల ఈ చిత్రంలోన‌టిస్తున్నారు. కాగా ఇప్పుడు బాలీవుడ్‌లో ‘ద‌బంగ్ 3’ ఫేమ్ సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ విష‌యాన్ని అడివిశేష్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘మేజ‌ర్‌’ సినిమాలో భాగం కావ‌డం గౌర‌వంగా, ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది అంటూ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ట్విట్ట‌ర్ ద్వారా ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. స‌యీ మంజ్రేక‌ర్ తెలుగులో వ‌రుణ్ తేజ్ లేటెస్ట్ మూవీలోనూ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.