బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు
Send us your feedback to audioarticles@vaarta.com
పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో సల్మాన్‌ను ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎలాంటి అస్వస్థతకు గురవ్వలేదని సమాచారం. పాము కాటు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజీఎం (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. రేపు (సోమవారం) సల్మాన్ ఖాన్ 56వ ఏట అడుగుపెట్టనున్నారు.
హిందీ బిగ్‌బాస్ 15 ‘‘వీకెండ్ కా వార్’’ ఎపిసోడ్లో, కంటెస్టెంట్లతో కలిసి సల్మాన్ .. క్రిస్మస్తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళితో కలిసి ఆలియా భట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సహనటులు ఆమెతో కలిసి వేదికపైకి వచ్చి సల్మాన్‌తో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయించారు. ఈ క్రమంలో సల్మాన్‌ను ఆకాశానికెత్తాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్‌బాస్ హిందీ వెర్షన్‌ను సల్మాన్ అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారని.. అది పేరుకు బిగ్ బాస్ అయినా, బిగ్ భాయ్ షో అని ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ షో ఇండియాలో సూపర్‌హిట్ కావడంలో సల్మాన్ కృషి ఎంతో ఉందని ఎన్టీఆర్ ప్రశంసించారు.
కాగా.. ‘‘సల్మాన్ తన ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు ఎన్నో పాములు చూశారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ.. తొలిసారిగా సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments