బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో సల్మాన్‌ను ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎలాంటి అస్వస్థతకు గురవ్వలేదని సమాచారం. పాము కాటు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజీఎం (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. రేపు (సోమవారం) సల్మాన్ ఖాన్ 56వ ఏట అడుగుపెట్టనున్నారు.

హిందీ బిగ్‌బాస్ 15 ‘‘వీకెండ్ కా వార్’’ ఎపిసోడ్‌లో, కంటెస్టెంట్లతో కలిసి సల్మాన్ .. క్రిస్మస్‌తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళితో కలిసి ఆలియా భట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సహనటులు ఆమెతో కలిసి వేదికపైకి వచ్చి సల్మాన్‌తో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయించారు. ఈ క్ర‌మంలో స‌ల్మాన్‌ను ఆకాశానికెత్తాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. బిగ్‌బాస్ హిందీ వెర్ష‌న్‌ను స‌ల్మాన్ అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారని.. అది పేరుకు బిగ్ బాస్ అయినా, బిగ్ భాయ్ షో అని ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ షో ఇండియాలో సూపర్‌హిట్ కావ‌డంలో స‌ల్మాన్ కృషి ఎంతో ఉంద‌ని ఎన్టీఆర్ ప్రశంసించారు.

కాగా.. ‘‘సల్మాన్ తన ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు ఎన్నో పాములు చూశారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ.. తొలిసారిగా సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు.

More News

నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు - రామ్ గోపాల్ వర్మ

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా'కొండా'.

జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా.. వాళ్లకి బూస్టర్ డోస్: ప్రధాని మోడీ ప్రకటన

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.

మొక్కలు నాటిన ఫరియా అబ్దుల్లా .. ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిలకు ఛాలెంజ్

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో సినీ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు.

ఒమిక్రాన్ ఎఫెక్ట్: న్యూ ఇయర్ వేడుకలపై బ్యాన్... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచంతో పాటు భారతదేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్: పిల్లలకు కొవిడ్ టీకా..  భారత్ బయోటెక్ ‘‘కొవాగ్జిన్‌కు’’ డీసీజీఐ అనుమతి

దక్షిణాఫ్రికాలో  పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.