సల్మాన్ సినిమా కూడా వాయిదా పడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
దీపికా పదుకొనే టైటిల్ పాత్రలో నటించిన 'పద్మావతి' సినిమా డిసెంబర్ 1న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్‌కు, చిత్ర యూనిట్ సరైన డాక్యుమెంట్స్ సమర్పించకపోవడంతో సెన్సార్ బోర్డు సినిమా సెన్సార్ ను ఆపేసింది. అంతే కాకుండా పాత రూల్‌ను తెరపైకి తెచ్చింది.
దాని ప్రకారం సినిమా సెన్సార్ అప్లై చేయడానికి 68 రోజులు ముందుగానే చేయాలట. ఇది దర్శక నిర్మాతలకు పెద్ద సమస్యగా మారనుంది. ఈ రూల్ ముందు నుండి ఉన్నప్పటికీ..బాలీవుడ్ వర్గాలు రూల్‌ను అనుసరించడం మానేశాయి.
మళ్లీ ఈ సినిమా బాలీవుడ్ చిత్రాలను ఇరుకున పెట్టనుంది. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ జిందా హై' సినిమా ఇంకా సెన్సార్‌కు అప్లై చేయలేదు.
ఇప్పుడు అప్లై చేసిన 68 రోజుల సమయం అంటే సినిమా డిసెంబర్ 22న మాత్రం విడుదల కాదు మరి. మరిప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com