అబ్బే... తూచ్ ఆ సింగర్‌కు సల్మాన్ గిఫ్ట్ ఇవ్వలేదట
Send us your feedback to audioarticles@vaarta.com
రాణు మోండాల్ అనే మహిళ.. పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పాడిన పాట ఓవర్ నైట్ సెలబ్రిటీగా మార్చేసిన విషయం విదితమే. ఈమెకు సినిమాల్లో పాటలు పాడేందుకు బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియా తన కొత్త చిత్రంలో అవకాశం ఇచ్చి.. రూ.6 నుంచి 7 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (సల్లు భాయ్) రాణు గాత్రానికి ఫిదా అయిపోయి రూ.55 లక్షలు విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రచురిస్తోంది. అయితే ఇది ఎంతవరకూ నిజమా అని ఆరా తీయగా అబ్బే అంతా తూచ్ అని తేలిందట.
అయితే.. ఈ వార్తలపై రాణు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విక్కీ బిశ్వాస్ అనే వ్యక్తి స్పందించారు. ఇదంతా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రమేన స్పష్టం చేశారు. సల్మాన్ ఇంతవరకూ ఎలాంటి బహుమతులు, సినిమాలో పాట పాడే అవకాశమిస్తున్నట్టు కానీ చెప్పలేదని ఈ సందర్భంగా విక్కీ చెప్పుకొచ్చారు. అయితే రేష్మియా పాటపాడే అవకాశం ఇవ్వడం, దానికి రెమ్యునరేషన్ ఇవ్వడం మాత్రం నిజమేనని చెప్పడం మంచి పరిణామామని చెప్పుకోవచ్పు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments