స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. వాఘా బోర్డ‌ర్ దగ్గ‌ర స‌ల్మాన్‌, క‌త్రినా కైఫ్ నిల‌బ‌డి చూస్తున్న‌ట్లు ఆ లుక్‌లో రివీల్ చేశారు.

ఈ లుక్‌ను స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమా వ‌చ్చే ఏడాది జూన్‌లో విడుద‌ల కానుంది. అలీ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ముందు ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ప్రియాంక ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో క‌త్రినాను హీరోయిన్‌గా తీసుకున్నారు.