Salaar Trailer: ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్... 'సలార్' ట్రైలర్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్

  • IndiaGlitz, [Friday,December 01 2023]

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 'సలార్ పార్ట్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 47 సెకన్ల నిడివిలో కట్ చేసిన ట్రైలర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చివర్లో 'ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది.

ఇక 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వవం వహించిన 'సలార్' మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. విలన్‌గా వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ జగపతి బాబు, శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిన పార్ట్1 డిసెంబర్ 22న విడుదల కానుండగా.. పార్ట్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ'(Dumki) సినిమాను విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది షారుఖ్ నటించిన 'పఠాన్'(Pathaan), సెప్టెంబర్‌లో విడుదలైన 'జవాన్'(Jawan) చిత్రాలు రూ.1000కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి.

దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More News

Police Son:పోలీస్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి..

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు.

Pawan Kalyan:ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడే పోరాటం చేశా: పవన్ కల్యాణ్‌

జనసేనకు యువతే పెద్ద బలమని.. రాష్ట్రంలో ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని జనసేనాని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతల నీతులు.. మీరా మాట్లాడేది..?

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన సత్తారు వెంకటేష్ రెడ్డి ఎన్నారై వైసీపీ నేత అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

KCR :అధికారంపై కేసీఆర్ ధీమా.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి సిద్ధమయ్యారు రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన