Salaar:ఫ్యాన్స్‌కు పూనకాలే.. అదిరిపోయిన 'సలార్' రిలీజ్ ట్రైలర్..

  • IndiaGlitz, [Monday,December 18 2023]

రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో సలార్ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులో భాగంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన 'సలార్- సీజ్ ఫైర్' థియేట్రికల్ ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల చేశారు. తాజా ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మెకానిక్‌గా పనిచేసే ప్రభాస్‌కు రెంచీలు తిప్పడమే కాదు తుపాకీ కూడా కాల్చడం వచ్చే సీన్లు ఇందులో చూపించారు. అలాగే తన స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం 'ఖాన్సారా' రాజ్యంలోకి అడుగుపెట్టి ఎలా విజయం సాధించాడనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారని అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఖాన్సారా కథను మార్చింది అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజా ట్రైలర్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి A సర్టిఫికెట్ లభించింది.

మరోవైపు 'సలార్' ఓ అరుదైన రికార్డు సాధించింది. యూఎస్‌లో 430 లొకేషన్లలో 1376 షోలకు గానూ అడ్వాన్స్ సేల్స్ ప్రారంభించగా.. అప్పుడే 1 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మూవీకి నాలుగు రోజులు ముందే కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఇంత భారీ ఎత్తున వసూళ్లు రావడం రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముంబైలోని ఆర్‌ మాల్‌లో 120 అడుగుల ప్రభాస్ కటౌట్ ఏర్పాటుచేయడం సంచలనంగా మారింది. దేశంలో ఇంత పెద్ద కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. వీటిని బట్టి చూస్తుంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. మొత్తానికి ప్రస్తుతం దేశమంతా 'సలార్' ఫీవరే నడుస్తోంది.

More News

Barrelakka: పవన్ కల్యాణ్‌ గురించి అలా మాట్లాడటం బాధేసింది: బర్రెలక్క

బర్రెలక్క.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. సోషల్ మీడియాలో బర్రెల్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్

'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Bigg Boss Telugu 7 : హౌస్‌ను కనుసైగతో శాసించి.. చాణక్యుడిగా నిలిచి , బిగ్‌బాస్ చరిత్రలోనే శివాజీ రెమ్యూనరేషన్ ఓ రికార్డు

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా..

Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు