Salaar:'సలార్-సీజ్ ఫైర్' రన్ టైమ్ ఫిక్స్.. ఎన్ని గంటలు అంటే..?

  • IndiaGlitz, [Monday,December 11 2023]

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్-సీజ్ ఫైర్. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ అందుకుని రికార్డు సృష్టించింది. డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం రన్‌ టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి కావడంతో ఈ మూవీ నిడివి 2 గంటల 55 నిమిషాల 22 సెకెన్లుగా ఫిక్స్ అయింది. అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్ భారీగా ఉండటంతో పాటు వయెలెన్స్ కూడా పరిమితికి మించి ఉండటంతో సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అటు ఇటుగా 3 గంటల సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కాస్త టెన్షన్ నెలకొంది. మూవీ స్టోరీ అద్భుతంగా ఉంటే సరే కానీ.. లేదంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉందంటున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం ఇటీవల విడుదలైన 'యానిమల్' చిత్రం దీని కన్నా ఎక్కువ నిడివి ఉన్నా హిట్ టాక్ అందుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ ప్రభాస్‌కు పడలేదు. సాహో యావరేజ్‌గా నిలిచినా రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో 'సలార్‌' మీదే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు విడుదలకు ముందే మూవీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనిని దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తో కొద్ది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ఈ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నింటిలో అత్యధిక ధర పలికిన సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఇక ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, టిన్ను ఆనంద్, రావు రమేశ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More News

Pawan Kalyan:నాదెండ్ల అరెస్ట్‌ను ఖండించిన పవన్ కల్యాణ్.. విశాఖ వస్తానని హెచ్చరిక..

విశాఖపట్టణంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Lokesh:లోకేష్ పాదయాత్రలో మరో మైలురాయి.. పాల్గొన్న బాలయ్య కొడుకు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది.

Corona:దేశంలో మరోసారి కరోనా కలకలం.. కేంద్రం కీలక ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి చేసిన ప్రాణవిలయం తలుచుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

YCP MLA Alla:బ్రేకింగ్: వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా

ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Supreme Court:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్రం నిర్ణయం సరైనదేనని.. పార్లమెంట్‌ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.