Salaar:రూ.3వేలు పలుకుతున్న "సలార్" బెనిఫిట్ ఫో టికెట్లు.. ఫ్యాన్స్ ఆందోళన..
Send us your feedback to audioarticles@vaarta.com
తమ అభిమాన హీరో ప్రభాస్‌ను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండగియా క్రేజీయెస్ట్ మూవీ "సలార్" డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను అందరికంటే ముందుగా చూడాలని అభిమానులు కుతూహలంతో ఉన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తెరవగానే టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే చిత్రబృందం బెనిఫిట్ షోస్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 22వ తేదిన తెల్లవారుజామున.. 21 అర్థరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దాంతో నైజాం ఏరియాలో మొత్తం 20 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంటకు సలార్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది దళారులు కూడా రంగంలోకి దిగారు.
ఫ్యాన్స్ క్రేజ్‌ను వాడుకునేందుకే టికెట్ రేట్లను ఏకంగా 15వందల రూపాయల నుంచి 3వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల నిర్వాహకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరో మూవీని ముందుగా చూడాలనుకునే అభిమానాన్ని కూడా ఇలా దోచుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముతున్న థియేటర్ల దగ్గర అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు ఎక్కువగా అమ్ముతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సలార్ సినిమా టికెట్ రేట్స్ వారం రోజుల పాటు పెంచుకునేందుకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఏపీ సర్కార్ 40 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్కో టికెట్ ధరపై రూ. 65, మల్టీప్లెక్స్‌లో రూ. 100 పెంపునకు అంగీకారం తెలిపింది. ఈ టికెట్ ధరల పెంపు ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments