Salaar:రూ.3వేలు పలుకుతున్న సలార్ బెనిఫిట్ ఫో టికెట్లు.. ఫ్యాన్స్ ఆందోళన..

  • IndiaGlitz, [Wednesday,December 20 2023]

తమ అభిమాన హీరో ప్రభాస్‌ను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండగియా క్రేజీయెస్ట్ మూవీ సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను అందరికంటే ముందుగా చూడాలని అభిమానులు కుతూహలంతో ఉన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తెరవగానే టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే చిత్రబృందం బెనిఫిట్ షోస్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 22వ తేదిన తెల్లవారుజామున.. 21 అర్థరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దాంతో నైజాం ఏరియాలో మొత్తం 20 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంటకు సలార్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు కొంతమంది దళారులు కూడా రంగంలోకి దిగారు.

ఫ్యాన్స్ క్రేజ్‌ను వాడుకునేందుకే టికెట్ రేట్లను ఏకంగా 15వందల రూపాయల నుంచి 3వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల నిర్వాహకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరో మూవీని ముందుగా చూడాలనుకునే అభిమానాన్ని కూడా ఇలా దోచుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముతున్న థియేటర్ల దగ్గర అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు ఎక్కువగా అమ్ముతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు సలార్ సినిమా టికెట్ రేట్స్ వారం రోజుల పాటు పెంచుకునేందుకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఏపీ సర్కార్ 40 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్కో టికెట్ ధరపై రూ. 65, మల్టీప్లెక్స్‌లో రూ. 100 పెంపునకు అంగీకారం తెలిపింది. ఈ టికెట్ ధరల పెంపు ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశాయి.

More News

Nagarjuna:రైతుబిడ్డ ప్రశాంత్ కారణంగా అరెస్ట్ కానున్న హీరో నాగార్జున?

బిగ్‌బాస్-7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రచ్చ రోజురోజుకు రచ్చ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది ఆకతాయిలు

Salaar: సలార్' ప్రమోషన్స్ షూరూ.. ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి..

దేశమంతా "సలార్' మేనియాతో ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడు మూవీని వెండితెరపై చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Telangana:ఖర్చులకు కూడా డబ్బులు లేవు.. తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే..?

రోజు వారీ ఖర్చులకి కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

AP Election :ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్.. మార్చిలో పోలింగ్..?

ఏపీలో ఎన్నికల సమరానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో నిర్వహించేందుకు

CM YS Jagan:సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సీఎం వైయస్ జగన్ బర్త్‌డే ఫొటో

వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు అంటే పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిది. సంవత్సరంలోని