దుబాయ్ లో సాక్ష్యం షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "సాక్ష్యం" అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
హైద్రాబాద్ రామోజీ ఫీలిం సిటీలో, పొల్లాచిలో, వారణాసి, హోస్ పేటలో కీలక సన్నివేశాలతోపాటు అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ లను పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కించిన చిత్ర బృందం తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "హైద్రాబాద్, పోల్లాచి, వారణాసి, హోస్ పేట వంటి ప్రాంతాల్లో భారీ క్యాస్టింగ్ తో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరిపాం. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది.
చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సాంగ్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలు మరియు పీటర్ మాస్టర్ నేతృత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నాం. అలాగే.. పూజా హెగ్డే, జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. వేసవి కానుకగా "సాక్ష్యం" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments