'సాక్ష్యం' మళ్ళీ వాయిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లుడు శీనుతో కథానాయకుడిగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ తరువాత స్పీడున్నోడు, జయజానకి నాయక చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం విజయం సాధించినా.. ఆ తరువాతి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా చిత్రం సాక్ష్యంపైనే ఆశలు పెట్టుకున్నారు ఈ యువ కథానాయకుడు.
పంచభూతాలే సాక్ష్యం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబు, శరత్ కుమార్, మీనా వంటి హేమాహేమీలు ప్రధాన పాత్రల్లో నటించారు. అందాల తార పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటించింది. చిత్రీకరణ దాదాపు పూర్తిచేసుకున్న ఈ సినిమాని తొలుత మే 11న రిలీజ్ చేయాలనుకున్నారు. అది కుదరకపోవడంతో జూన్ 14 అన్నారు. సీజీ వర్క్ కారణంగా మళ్ళీ జూలై 20కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని జూలై 27కి వాయిదా వేశారని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments