సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో యేంటి రాజా యూత్ ఇలా ఉంది...
Send us your feedback to audioarticles@vaarta.com
లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎమ్వీఎస్ సాయి క్రిష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది. దర్శకుడు ఆది శేష సాయి రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా..ఇతర ముఖ్య పాత్రల్లో పర్వీన్ రాజ్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. యువ ప్రేక్షకులకు నచ్చే కథా కథనాలతో సందేశాత్మకంగా ఈ సినిమా ఉండబోతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యేంటి రాజా యూత్ ఇలా ఉంది చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాత దిల్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా విశేషాలు ఆయనకు వివరించారు. అనంతరం టీజర్ ను విడుదల చేశారు. తర్వాత దర్శకుడు శేష సాయి రెడ్డి మాట్లాడుతూ...ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. నేటి సమాజంలో యువత ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తుంది. సాక్షి చౌదరి ముఖ్య పాత్రలో కథ సాగుతుంది. నేటి తరం అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమను ఒక ఆట వస్తువుగా భావిస్తున్నారు.
దీని వల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి చెడు జరుగుతుందో వినోదాత్మకంగా చూపించాం. అమ్మాయైనా, అబ్బాయైనా జీవితాంతం ఒకరి తోడుగానే ఉండాలని సందేశం ఇచ్చాం. వివాహానంతర సంబంధాలు కుటుంబాలను కూల్చివేస్తున్న నేపథ్యాలు ఈ చిత్ర కథలో ఉంటాయి. త్వరలో ఆడియో కార్యక్రమం జరిపి ఈ నెలాఖరుకు చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.
నాగ రాకేష్, ఇంద్ర, సంతోష్, పూజితా, అవంతిక, శ్రావణి, అక్షర, భరణి, అప్పారావు, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - శంకర్, సంగీతం - కిషన్, ఎడిటర్ - నందమూరి హరి, ఆర్ట్ - విజయ్ కృష్ణ, పాటలు - రామ్ పైడిశెట్టి, శ్రీ గణేష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments