‘సాకి వరల్డ్’ పేరుతో సమంత కొత్త బిజినెస్..
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు ఒక స్టార్ డమ్ వచ్చాక.. వాళ్ల దృష్టినంతా వ్యాపారంపై పెడుతుండటం కామన్. ఇప్పటికే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు వివిధ వ్యాపారాల్లో బాగా సెటిలై ఉన్నారు. ఇక వస్త్ర వ్యాపారం విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ.. ‘రౌడీ’ అనే బ్రాండ్‌తో బాగా పాపులర్ అయిపోయాడు. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత కూడా వస్త్ర వ్యాపారంపై దృష్టి సారించింది.
సమంత అక్కినేని వస్త్ర వ్యాపారం నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. కొంత కాలం క్రితం సమంత చేనేత వస్త్రాలను పరిశీలించి ఆసక్తిని కనబరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వస్త్ర వ్యాపారాన్ని ఆమె ప్రారంభించాలనుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఏక్కం అనే ప్రీ స్కూల్ బిజిస్ను స్టార్ట్ చేసిన సమంత త్వరలోనే మహిళల వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించబోతోంది.
తను నూతన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న విషయాన్ని సమంత స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సాకి వరల్డ్ పేరుతో తాను దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమంత తెలిపింది. త్వరలోనే సాకి వరల్డ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నానని సమంత వెల్లడించింది. తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమను సాకి వరల్డ్ తెలియజేస్తుందని.. అది మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానని సామ్ ట్వీట్లో పేర్కొంది.
Saaki @saakiworld is finally here! Saaki has been a dream of mine and my baby for many months. It is a reflection of my love for fashion and my journey in life. #saakiforyou #launchingsoon Hope you like it ?? pic.twitter.com/cJ31pAY5Zo
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout