Sajjala:వైఎస్ సునీత ముసుగు తొలగిపోయింది.. చంద్రబాబుతో ఆమె కలిపారు: సజ్జల
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ముసుగు తొలగిపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా..? అని ప్రశ్నించారు. ఈ కేసు నాలుగైదు రోజుల్లో తెలిపోవాల్సిందే అయితే చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని నిలదీశారు. మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా అని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని.. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు.
అప్పట్లో వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజార్టీ ఆరోజు ఉందని.. వివేకాను ఓడించిన టీడీపీతో కలిసి సునీత పనిచేస్తున్నారని చెప్పారు. వివేకాను ఓడించింది బీటెక్ రవి కాదా? అని అన్నారు. అలాంటి చంద్రబాబు, బీటెక్ రవితో ఆమె ఎందుకు కలిశారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో సునీత పావులా మారారని.. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని వెల్లడించారు.
కాగా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాకూడదంటూ వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్‌కు చెందిన వైసీపీకి ఓటేయొద్దని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. అలాగే సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యలు చేసేవాళ్లు రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ఉండకూడదు, పాలించకూడదన్నారు. మరోసారి తన అన్న అధికారంలోకి వస్తే వివేకా హత్య కేసుకు న్యాయం జరగదని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు మర్డర్ చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుందని.. కానీ వివేకా కేసులో ఐదేళ్లైనా ఇంకా ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని.. ఆయనను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని కోరారు. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? అన్నారు. జగన్ మీద 11 అక్రమ కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే వివేకా హత్య కేసు కూడా కాకూడదని వాపోయారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని సునీత వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments