Sajjala: పవన్‌ను చూస్తే జాలేస్తోంది.. మరి ఇంత దిగజారిపోయారు.. సజ్జల సెటైర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకం చూస్తే తనకు బలం లేదని పవన్ కల్యాణ్ ఒప్పుకుంటున్నట్లు తేలిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోందని.. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని తెలిపారు. జనసేన పార్టీని చంద్రబాబు మింగాలని చూస్తున్నారని.. టీడీపీకి అనుబంధ విభాగంగా జనసేన పార్టీ మారిందని ఎద్దేవా చేశారు.
జనసేన అధ్యక్షుడు అనే దాని కంటే పార్టీని విలీనం చేసి టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. వైసీపీని ఎందుకు గద్దె దించాలో కారణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పలేకపోతున్నారన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని దిగజార్చుకొని అభిమానులను, సొంత సామాజిక వర్గం వారిని మోసం చేస్తున్నారని తెఇలపారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లు తీసుకొని ఎవరిపై ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.
ముందు 24 సీట్లకు అభ్యర్థులను ప్రకటించమని సజ్జల సవాల్ చేశారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదని.. ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా తమకు ఇబ్బంది లేదని ఆయన వెల్లడించారు. 175 స్థానాల్లో విజయం కోసం కృషి చేస్తున్నామని.. కుప్పంలో కూడా విజయం వైపు అడుగులు వేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక మంత్రి అంబటి రాంబాబు కూడా ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. "పల్లకి మోయడానికి తప్ప.. పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ పవన్ కల్యాణ్. పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే.. విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది.. మన అన్నగారిలా!!" అంటూ పోస్ట్ చేశారు.
అలాగే మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు బంగారు భవిష్యత్తును చూసేందుకే పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎప్పుడూ చేయనంత సుదీర్ఘ కసరత్తు చేశానని చంద్రబాబు అన్నారని... ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందంటే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు వైసీపీదేనని వైవీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో మంత్రి రోజా కూడా సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. 24 సీట్ల కోసం చంద్రబాబు వద్ద జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout