చుట్టాలబ్బాయి టీమ్ సమక్షంలో జరిగిన సాయికుమార్ జన్మదిన వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది హీరోగా వీరభద్రమ్ తెరకెక్కించిన చిత్రం చుట్టాలబ్బాయి. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ ముఖ్యపాత్ర పోషించారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రామ్ తాల్లూరి, వెంకట్ తలారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికుమార్ పుట్టినరోజును చుట్టాలబ్బాయి టీమ్ సమక్షంలో జరుపుకున్నారు. అనంతరం చుట్టాలబ్బాయి స్పెషల్ టీజర్ ను సాయికుమార్ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ...ఇది నా 55వ పుట్టినరోజు. అలాగే ఆది, నేను కలిసి నటించిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అందుకనే ఈ పుట్టినరోజున ఒక క్యాండిల్ పెట్టి కేక్ కట్ చేసాను. ఇప్పుడే డబ్బింగ్ చెప్పాను. నాన్న గారు, నేను, ఆది కలిసి సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. అయితే...ఈ సినిమాలో నేను, ఆది ఉన్న ఓ సీన్ లో నాన్న ఫోటో కనిపిస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు నాన్న మాతోనే ఉన్నారనిపించింది.
ప్రేమకావాలి, లవ్ లీ చిత్రాలతో సక్సెస్ సాధించినప్పటికీ ఆది బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. తప్పకుండా చుట్టాలబ్బాయి ఆది కెరీర్ లో బిగ్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటున్నాను. వీరభద్రమ్ విభిన్నమైన కథాంశంతో మంచి చిత్రాన్నితీసాడు. నిర్మాతలు ఏమాత్రం రాజీపడకుండా కథకు ఏం కావాలో అవన్నీఉండేలా చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మించారు. తమన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు. పటాస్, సుప్రీమ్, సరైనోడు...ఇలా ఈమధ్య నేను నటించిన సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆవిధంగా చూసుకున్నా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ... ఎప్పటి నుంచో నాన్న నేను కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. భవిష్యత్ లో మరిన్నిసినిమాలు కలిసి చేయాలనుకుంటున్నాను.చుట్టాలబ్బాయి ఆడియో & టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం అన్నారు.
డైరెక్టర్ వీరభద్రమ్ మాట్లాడుతూ...సాయికుమార్ గారంటే నాకు చాలా ఇష్టం. మంచి మనసున్న మనిషి.ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆగష్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. ఖచ్చితంగా చుట్టాలబ్బాయి అందరికీ నచ్చుతుంది అన్నారు.
నిర్మాత రామ్ తాల్లూరి మాట్లాడుతూ...ఈ చిత్రంలో సాయికుమార్ విలక్షణ పాత్ర పోషించారు. ఈ క్యారెక్టర్ ను వీరభద్రమ్ చాలా బాగా డిజైన్ చేసారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చుట్టాలబ్బాయి చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com