నా జీవితం గతం కంటే ఎంతో బావుందంటున్న స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరు స్టార్స్ మాట్లాడుతుంటే ఎలాంటి దాపరికం ఉండదు. నేరుగా మాట్లాడేస్తారు. కానీ మరికొందరు మాత్రం చాలా దాపరికంగా మాట్లాడుతుంటారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ రెండు కేటగిరీకి చెందిన వాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూనే అందుకు నిదర్శనం.
భారతదేశంలో ఉంటుంన్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్. రీసెంట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధథించిన పలు విషయాలను పంచుకున్నారు. ``మన దేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం, ప్రతి ఒక్కరూ నా కుటుంబానికి ఇచ్చే గౌరం, పిల్లల చదువులు, నా ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ప్రతి విషయంలో గతం కంటే నా జీవితం ఎంతో బావుంది. అలాగే ప్రస్తుతం రాజకీయాలపై నోరు విప్పలేను. ఎందుకంటే నా భావాలు కొందరికి నచ్చవచ్చు. మరికొందరికీ నచ్చకపోవచ్చు. అందుకనే రాజకీయాల గురించి మాట్లాడలేకపోతున్నాను. నా భావాలను నాలోనే ఉంచుకుంటున్నాను. అంతే కాకుండా రాజకీయాల గురించి ఓ స్పష్టతను రాబ్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను`` అంటూ తెలివిగా బదులిచ్చారు సైఫ్ అలీఖాన్.
కరీనాకపూర్ను పెళ్లి చేసుకున్న సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన తానాజీ, జవానీ జానేమన్, దిల్ బేచారా సినిమాల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments