close
Choose your channels

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. 'దేవర' సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

Tuesday, January 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. దేవర సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌లో సైఫ్ గాయపడినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే షూటింగ్‌లో ఆయన మోకాలు, భుజానికి గాయాలు అయినట్లు.. వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది.

మూడు వారాలు విశ్రాంతి..

ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ జరగడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. . మరోవైపు గాయంపై స్పందించిన సైఫ్.. గాయాలు వృత్తిలో భాగమే.. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. దీంతో ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న షూటింగ్.. సైఫ్ గాయంతో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి షూటింగ్ ఆలస్యమైతే అనుకున్న తేదీకి సినిమా విడుదల ఉంటుందో లేదోనని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. దేవర సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

తారక్-కొరటాల కాంబోపై క్రేజ్..

కాగా RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన 'జనతాగ్యారేజ్' చిత్రం బ్లాక్‌బాస్టర్ అవ్వడంతో ఈ మూవీకి విపరతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అలనాటి సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం.. అంతేకాకుండా కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. దేవర సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

విపరీతంగా ఆకట్టుకున్న గ్లింప్స్..

ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో "ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు" అంటూ తారక్ చెప్పిన డైలాగ్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన బీజీఎం అయితే గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే అభిమానుల ఆశలు నిలబెట్టుకునేలా మూవీ యూనిట్ కూడా అహర్నిశలు శ్రమిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment