Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. 'దేవర' సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

  • IndiaGlitz, [Tuesday,January 23 2024]

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌లో సైఫ్ గాయపడినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే షూటింగ్‌లో ఆయన మోకాలు, భుజానికి గాయాలు అయినట్లు.. వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది.

మూడు వారాలు విశ్రాంతి..

ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ జరగడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. . మరోవైపు గాయంపై స్పందించిన సైఫ్.. గాయాలు వృత్తిలో భాగమే.. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. దీంతో ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న షూటింగ్.. సైఫ్ గాయంతో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి షూటింగ్ ఆలస్యమైతే అనుకున్న తేదీకి సినిమా విడుదల ఉంటుందో లేదోనని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తారక్-కొరటాల కాంబోపై క్రేజ్..

కాగా RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన 'జనతాగ్యారేజ్' చిత్రం బ్లాక్‌బాస్టర్ అవ్వడంతో ఈ మూవీకి విపరతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అలనాటి సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం.. అంతేకాకుండా కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.

విపరీతంగా ఆకట్టుకున్న గ్లింప్స్..

ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు అంటూ తారక్ చెప్పిన డైలాగ్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన బీజీఎం అయితే గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే అభిమానుల ఆశలు నిలబెట్టుకునేలా మూవీ యూనిట్ కూడా అహర్నిశలు శ్రమిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

More News

వైసీపీకి మరో బిగ్ షాక్.. నరసరావుపేట ఎంపీ రాజీనామా..

ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు(Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు.

అభివృద్ధి కనిపించడం లేదా..? షర్మిల వ్యాఖ్యలపై సజ్జల విమర్శలు..

అప్పుడే మీసాలు వచ్చిన కుర్రాడు నా అంత పోటుగాడు లేడని ఊహించుకుంటూ ఉంటాడు.. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల.. అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ

బాల రాముడు ప్రాణప్రతిష్ట సమయంలో కన్నీళ్లు వచ్చాయి: పవన్

కోట్ల మంది భారతీయులు 500 ఏళ్లు నుంచి ఎదురుచూసిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యా్హ్నం అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి

కలెక్షన్ల సునామీ సృష్టించిన 'హనుమాన్'.. టాప్‌-5 సినిమాల్లో చోటు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన'హనుమాన్'చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హనుమంతుడిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన

YS Sharmila: పార్టీ బలోపేతమే లక్ష్యం.. జిల్లాల పర్యటనకు వైయస్ షర్మిల శ్రీకారం..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila) పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో రేపటి(మంగళవారం) నుంచి జిల్లాల