సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘నో పెళ్లి..’ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే.
విడుదలైనప్పటి నుండే సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. మరో పక్క సాయితేజ్‌తో పాటు రానా, వరుణ్ తేజ్ ఈ పాటలో కనిపించడం మరో ప్లస్ అయ్యింది. పాట యూత్‌లోకి దూసుకెళ్లింది. ఇదే పాటను టాలీవుడ్ సింగర్స్ అందరూ కలిసి నో పెళ్లి కవర్ సాంగ్ అనే పాడటం విశేషం. ఇలా రోజు రోజుకీ ఈ పాటకు ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ పాట ఓ అరుదైన రికార్డ్‌ను టచ్ చేసింది. కోటి (10 మిలియన్) వ్యూస్ దక్కించుకుని అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటను రఘురామ్ రాయగా.. అర్మాన్ మాలిక్ పాటను పాడారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments