సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘నో పెళ్లి..’ సాంగ్

  • IndiaGlitz, [Saturday,June 13 2020]

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌'. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

విడుద‌లైనప్ప‌టి నుండే సోష‌ల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. మ‌రో ప‌క్క సాయితేజ్‌తో పాటు రానా, వ‌రుణ్ తేజ్ ఈ పాట‌లో క‌నిపించ‌డం మ‌రో ప్ల‌స్ అయ్యింది. పాట యూత్‌లోకి దూసుకెళ్లింది. ఇదే పాట‌ను టాలీవుడ్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి నో పెళ్లి క‌వ‌ర్ సాంగ్ అనే పాడటం విశేషం. ఇలా రోజు రోజుకీ ఈ పాట‌కు ఆద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ పాట ఓ అరుదైన రికార్డ్‌ను ట‌చ్ చేసింది. కోటి (10 మిలియ‌న్‌) వ్యూస్ ద‌క్కించుకుని అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.

More News

మాక్ షూట్‌కి జ‌క్క‌న్న అండ్ టీమ్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిపై రెండు తెలుగు ప్ర‌భుత్వాలు పెద్ద బాధ్య‌త‌నే పెట్టాయ‌నుకోవాలి.

కాస్టింగ్ కౌచ్‌పై తేజ‌స్వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హీరోయిన్‌, హీరోయిన్ స్నేహితురాలిగా ప‌లు సినిమాల్లో న‌టించిన తేజ‌స్విని మ‌డివాడ రీసెంట్‌గా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చింది.

రెమ్యున‌రేష‌న్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్?

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా భారీ న‌ష్టాలే వాటిల్లింది. రెండు నెల‌లు పాటు సినిమాల రిలీజులు లేవు.

రైతుల‌కు అమ‌ల అక్కినేని సాయం

అమ‌ల అక్కినేని ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ముఖ్యంగా బ్లూ క్రాస్ సంస్థ‌కు హైద‌రాబాద్‌లో అమ‌ల అక్కినేని కో ఫౌండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

మాజీ లవర్‌తో సినిమా చేస్తానంటున్నర‌ష్మిక‌

న‌య‌న‌తార‌, హ‌న్సిక బాట‌లోనే తాను పయనిస్తాన‌ని అంటోంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌.