ప్రేమికుల రోజున డిఫరెంట్ టీజర్‌తో సాయితేజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతిరోజూ పండగే` చిత్రాలతో విజయాలను అందుకున్న యువ కథానాయకుడు సాయితేజ్. ఈయన హీరోగా సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 14..ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి థీమ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సింగిల్స్ ఆర్మీని లీడ్ చేసే యువకుడి పాత్రలో సాయితేజ్ కనపడబోతున్నారని వీడియో చూస్తే అర్థమవుతుంది.
``కోపం..ఇష్టం, విచారం..సంతోషం, ఆనందం..బాధ, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో మారిపోయే ఫీలింగ్స్, మరి ప్రేమ కూడా ఫీలింగే కదా. మారదని గ్యారంటీ ఏంటి? మన గోల్ నో లవ్.. మన ఎజెండా ఫ్రీడమ్, చివరగా మన స్లోగన్ సోలో బ్రతుకే సో బెటర్`` అంటూ సాయితేజ తన బ్యాచ్‌లర్ ఆర్మీతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 1న విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com