అయినా సరే... థమన్ నే కావాలంటున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయితేజ్, అల్లు శిరీష్... ఇలా మెగా కాంపౌండ్‌లోని దాదాపు అందరు యంగ్ హీరోలతోనూ పనిచేసిన వైనం యువ సంగీత సంచలనం థమన్ సొంతం. అయితే, వీరిలో ఒక్క సాయితేజ్‌తో తప్ప ప్రతి మెగా హీరోతోనూ విజయాలను చూశాడు థమన్. చిత్రంగా ఎక్కువ సినిమాలు చేసింది కూడా సాయితేజ్తోనే కావడం గమనార్హం. `తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్`...ఇలా ఇప్పటికే సాయితేజ్, థమన్ కాంబోలో నాలుగు సినిమాలు రాగా, అన్నీ కూడా నిరాశపరిచాయి.
అయినప్పటికీ... థమన్‌తోనే మరో రెండు సినిమాలకు కమిటయ్యాడు సాయితేజ్. అందులో ఒకటి `ప్రతి రోజూ పండగే` కాగా.. మరొకటి `సోలో బ్రతుకే సో బెటర్`. మారుతి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న `ప్రతి రోజూ పండగే` డిసెంబర్లో విడుదల కానుండగా... నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న `సోలో బ్రతుకే సో బెటర్` ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది. క్యాచీ టైటిల్స్‌తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు కూడా మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్‌లతోనే తెరకెక్కుతున్నాయని సమాచారం. మరి... ఇప్పటికే నాలుగు అపజయాలు ఉన్నా థమన్‌నే ఏరికోరి ఎంపిక చేసుకున్న సాయితేజ్‌కి రాబోయే రెండు చిత్రాలైనా విజయాలను అందిస్తాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments