అయినా స‌రే... థ‌మ‌న్ నే కావాలంటున్నాడు

  • IndiaGlitz, [Thursday,October 10 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సుప్రీమ్ హీరో సాయితేజ్‌, అల్లు శిరీష్‌... ఇలా మెగా కాంపౌండ్‌లోని దాదాపు అంద‌రు యంగ్ హీరోల‌తోనూ ప‌నిచేసిన వైనం యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ సొంతం. అయితే, వీరిలో ఒక్క సాయితేజ్‌తో త‌ప్ప ప్ర‌తి మెగా హీరోతోనూ విజ‌యాల‌ను చూశాడు థ‌మ‌న్‌. చిత్రంగా ఎక్కువ సినిమాలు చేసింది కూడా సాయితేజ్‌తోనే కావ‌డం గ‌మ‌నార్హం. 'తిక్క‌, విన్న‌ర్‌, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌'...ఇలా ఇప్ప‌టికే సాయితేజ్‌, థ‌మ‌న్ కాంబోలో నాలుగు సినిమాలు రాగా, అన్నీ కూడా నిరాశ‌ప‌రిచాయి.

అయిన‌ప్ప‌టికీ... థ‌మ‌న్‌తోనే మ‌రో రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు సాయితేజ్‌. అందులో ఒక‌టి 'ప్ర‌తి రోజూ పండ‌గే' కాగా.. మ‌రొక‌టి 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌'. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న 'ప్ర‌తి రోజూ పండ‌గే' డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుండ‌గా... నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు తెర‌కెక్కిస్తున్న 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌' ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. క్యాచీ టైటిల్స్‌తో తెర‌కెక్కుతున్న ఈ రెండు సినిమాలు కూడా మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న స‌బ్జెక్ట్‌ల‌తోనే తెర‌కెక్కుతున్నాయ‌ని స‌మాచారం. మ‌రి... ఇప్ప‌టికే నాలుగు అప‌జ‌యాలు ఉన్నా థ‌మ‌న్‌నే ఏరికోరి ఎంపిక చేసుకున్న సాయితేజ్‌కి రాబోయే రెండు చిత్రాలైనా విజ‌యాల‌ను అందిస్తాయేమో చూడాలి.

More News

చైత‌న్య-సాయి ప‌ల్ల‌వి సినిమా వాయిదా ?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా చిత్రీక‌ణ‌ను ప్రారంభించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆమె బ‌యోపిక్‌లో ప్ర‌కాష్ రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయ‌డానికే ఆయ‌న ఆస‌క్తి చూపుతుంటారు.

'శ్రీపూర్ణిమ' మా అదృష్టమన్న జబర్దస్త్ టీమ్

గురువారం వస్తే చాలు నవ్వుల ప్రియులకు పండగే. ' జబర్దస్త్ ' ప్రోగ్రామ్ తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోంది.

ఐదు అద్భుతాలతో హల్ చల్ చేస్తున్న పురాణపండ శ్రీనివాస్

అసాధారణ ప్రతిభావంతుడైన పురాణపండ శ్రీనివాస్ అనే ఒకే ఒక్క రచయిత ప్రసార ప్రచార మాధ్యమాలకు దూరంగా తానే శ్రామికుడై, తానే యజమానై అద్భుత గ్రంధాలను రచించి, సంకలనం చేసి

వ‌ర‌ద బాధితులకు అమితాబ్ సాయం

కొన్ని రోజులుగా బిహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జలు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. 15 జిల్లాల్లోని 1400 గ్రామాలు జ‌ల‌మ‌య‌మైయాయి.