హిట్ పెయిర్ హ్యాట్రిక్
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరు హీరో హీరోయిన్ జోడీ ప్రేక్షకులకు రిపీట్ అయినా బోర్ కొట్టదు సరి కదా! వారు కలిసి నటిస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో వస్తుంది. నేటి తరం కుర్ర హీరోల్లో సుప్రీమ్ హీరో సాయితేజ్, రాశీఖన్నాకు హిట్ పెయిర్‌గా పేరుంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సుప్రీమ్’. ఈ సినిమా చాలా పెద్ద హిట్ మూవీగానే నిలిచింది. తర్వాత గత ఏడాది మరోసారి ఇద్దరూ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో జత కట్టారు. ఈ చిత్రమైతే సాయితేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. కాగా..వీరిద్దరూ కలిసి మరోసారి నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి.
రీసెంట్గా సాయితేజ్ హీరోగా దేవ కట్ట దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి జరగనుంది. ఇందులో నివేదా పేతురాజ్ మెయిన్ హీరోయన్‌గా నటిస్తుంది. కాగా.. ఇందులో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందట. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ పాత్రలో రాశీఖన్నాకు నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. కొంత టాకీ..ఓ సాంగ్‌ను సాయితేజ్, రాశీఖన్నాపై చిత్రీకరిస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com