బరువు తగ్గుతున్న సాయితేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో సాయి తేజ్ రీసెంట్గా విడుదలైన `చిత్రలహరి`తో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా కోసం గడ్డం పెంచి బరువు తగ్గిన సాయితేజ్.. తదుపరి సినిమాలో క్లీన్ షేవ్‌లో కనపడబోతున్నాడు. `శైలజారెడ్డి అల్లుడు` చిత్రం తర్వాత మారుతి డైరెక్ట్ చేయబోయే చిత్రమిదే. యాక్షన్, రొమాంటిక్, కామెడీ అంశాలతో మారుతి కథను తయారు చేశాడట. జూన్ లేదా జూలై నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో పాత్ర కోసం సాయితేజ్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం సాయితేజ్ సీరియస్‌గా కసరత్తులు చేసేస్తున్నాడట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, జి.ఎ 2 పిక్చర్స్ సంస్థలు నిర్మించనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout