Sai Tej:మామ కోసం బరిలోకి మేనల్లుడు.. మూడు రోజుల పాటు ప్రచారం..

  • IndiaGlitz, [Saturday,May 04 2024]

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు పవన్‌ను ఓడించాలని అధికార వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆర్థిక, అంగ బలంతో పవన్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే జనసేనాని కూడా ఈసారి వారి కుట్రలను ఛేదించి గెలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఓవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్, హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా పవన్ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా రంగంలోకి పవన్ తరపున రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. తాజాగా మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ రంగంలోకి దిగనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంతో పాటు మరో రెండు చోట్ల కూడా ప్రచారం చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

మే 4న మచిలీపట్నం, మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయితేజ్ ప్రచారం చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పేర్కొంది. కాగా మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తుండగా.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్.. కాకినాడ లోక్‌సభ స్థానానికి ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. వీళ్ల ముగ్గురి తరఫున సాయి తేజ్ ప్రచారం చేయనున్నారు. మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు మద్దతుగా యాంకర్ శ్యామలా రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ఇతర సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురం ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మే 13న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

More News

Vemula Rohit:వేముల రోహిత్ దళితుడు కాదు.. కేసు మూసివేసిన పోలీసులు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో

BRS:బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

తెలంగాణ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో

Rahul Gandhi:రాయ్‌బరేలీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు

Telangana Congress;లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో టీ కాంగ్రెస్ రూపొందించింది.

Mudragada Daughter:ముద్రగడకు ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. పవన్ కల్యాణ్‌కు మద్దతు..

ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానం పిఠాపురం.