కృష్ణదేవరాయల పాత్రలో సాయితేజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది విడుదలైన ప్రతిరోజూ పండగే చిత్రంతో తన కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల ఆగింది. ఈ సినిమా విడుదల కాకుండానే మరో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. వాటిలో ఒకటి దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఇక మరో చిత్రం వీరు పోట్ల డైరెక్షన్లో రూపొందనుందని టాక్. పీరియాడికల్ జోనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన వార్తొకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
సమాచారం మేరకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి కాలానికి చెందిన కథను వీరు పోట్ల తయారు చేశాడని అందులో కృష్ణదేవరాయల గెటప్‌లో సాయితేజ్ కనిపించనున్నారని టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, బాలకృష్ణ, శ్రీకాంత్ తర్వాత కృష్ణదేవరాయలుగా నటించిన స్టార్స్ తక్కువే. తొలిసారి ఓ మెగా క్యాంప్ హీరో కృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారన్నమాటేగా!.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com