సాయి తేజ్ డేరింగ్ స్టెప్.. 'రిపబ్లిక్' కోసం పని మొదలు!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో లాక్ డౌన్ మొదలైనప్పుడు అన్ని సినిమాల విడుదల నిలిచిపోయింది. కరోనా మొదటి వేవ్ ప్రభావం కాస్త తగ్గాక తెలుగులో థియేటర్స్ లో విడుదలైన తొలి చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.
ఇదీ చదవండి: రూ.410 కోట్ల నెట్ వర్త్, 120 కోట్ల ఆదాయం.. థలపతి విజయ్ అంటే ఇది!
గత ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నిబంధనల్ని బట్టి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ 50 శాతం ఆక్యుపెన్సీ తోనే విడుదల చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కరోనా తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రానికి మద్దతుగా నిలిచింది.
ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. సినిమాల రిలీజ్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో గత ఏడాది సీనే ఇప్పుడు కూడా రిపీట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోయే తొలి చిత్రం 'రిపబ్లిక్' అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే సాయి తేజ్ కూడా డబ్బింగ్ మొదలు పెట్టేశాడు. అయితే ఈసారి ప్రభుత్వం 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి.
దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, రాజ్యాంగ నిబంధనల అమలుపై దేవకట్ట తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. భగవాన్,పుల్లారావు ఈ చిత్రానికి నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments