సాయితేజ్15.. జోడీ ఖరారైంది..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో, సాయితేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం సాయితేజ్ తన లుక్‌ను పూర్తి మార్చుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లేటెస్ట్గా ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సంయుక్త మీనన్.. సాయితేజ్ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది. కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోన్న సంయుక్త మీనన్ ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది మరి. మిస్టిక్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సాయితేజ్ నటిస్తోన్న 15వ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడే ఈ కార్తీక్ దండు. మరి కార్తీక్ తొలి చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ఇప్పుడు దేవా కట్ట దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ‘రిపబ్లిక్’. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com