విష్ణు ఆ..డైరెక్టర్ తో సినిమా చేస్తున్నడా....?

  • IndiaGlitz, [Friday,September 04 2015]

మంచు విష్ణు తాజా చిత్రం డైన‌మేట్ రిలీజ్ అయ్యిందో లేదో...అప్పుడే త‌న త‌దుప‌రి చిత్రం ప్రారంభోత్స‌వం చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. డైన‌మేట్ త‌రువాత విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విష్ణునే నిర్మించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ప్ర‌చారంలో ఉన్న‌ట్టు వెంట‌నే విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప చిత్రం చేయ‌డం లేదు. దీని కంటే ముందు మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసాడు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు....నాగ్ మేన‌ల్లుడు సుశాంత్ తో అడ్డా చిత్రాన్ని తెర‌కెక్కించిన సాయి రెడ్డి డైరెక్ట‌ర్. విభిన్న క‌ధాంశంతో రూపొందే ఈ సినిమాని ఈ నెల 10న‌ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...పూరి శిష్యుడు సాయి రెడ్డితో విష్ణు ఎలాంటి సినిమా చేస్తున్నాడనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.