టాలెంటెడ్ డైరెక్టర్‌తో సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఫిదా’, ‘ఎం.సి.ఎ.’ సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు యువ కథానాయక సాయిపల్లవి. ఈ సినిమాలతో రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి.. హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ డైరెక్షన్లో నాగశౌర్యకి జంటగా సాయిపల్లవి నటించిన ‘కణం’ త్వరలోనే తెరపైకి రానుంది. ఇది కూడా కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడం విశేషం.
అంతేగాకుండా.. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయిపల్లవి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న చిత్రం ‘నీది నాది ఒకే కథ’ ను డైరెక్ట్ చేసిన వేణు ఊడుగుల.. తన తదుపరి సినిమా కోసం సాయిపల్లవిని సంప్రదించారట. అంతేగాకుండా.. కథానాయిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక లైన్ కూడా ఈమెకు వినిపించారట. కథ నచ్చడంతో ఈమె ఓకే చేసారని సమాచారం. ప్రస్తుతం ఈ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారు దర్శకుడు. దీనిపై మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com