అలా చేయ‌నంటున్న‌ సాయిప‌ల్ల‌వి 

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి త‌దుప‌రి 'ఎంసిఎ'లో కూడా న‌టించి ఆక‌ట్టుకుంది. ఈమె ఇప్పుడు సూర్య 'ఎన్‌.జి.కె' చిత్రంతో మే లో సంద‌డి చేయ‌నుంది. సినిమాల ఎంపిక‌లో ఆచితూచి నిర్ణ‌యం తీసుకునే సాయిప‌ల్ల‌వి చేసిన ఓ ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. దీని వ‌ల్ల సాయిప‌ల్ల‌వికి ఏకంగా రెండు కోట్ల రూపాయ‌లు రావాల్సిన సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చి ఆ ప‌నిని వ‌ద్ద‌ని చెప్పేసిందట సాయిప‌ల్ల‌వి. అదేంటంటే బ్రాండ్ అంబాసిడ‌ర్‌.

సాధార‌ణంగా సినీ తార‌లు ప‌లు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా ప‌నిచేస్తుంటారు. వాటి వ‌ల్ల మంచి ఆదాయాన్నే పొందుతుంటారు కూడా. అయితే సాయిప‌ల్ల‌వి అందుకు భిన్న‌మ‌ని చెబుతుంది. ఓ కంపెనీవారు త‌మ ప్రొడక్ట్స్‌కు సాయిప‌ల్ల‌విని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని, అందుకు రెండు కోట్ల రూపాయ‌లను ఇస్తామ‌ని చెప్పినా సాయిప‌ల్ల‌వి సింపుల్‌గా నో చెప్పేసింద‌ట‌. అందుకు ప్ర‌త్యేక కార‌ణంగా సినిమాల‌పైనే ఫోక‌స్‌గా ఉండాల‌ని ఆమె నిర్ణ‌యించుకోవ‌డ‌మేనంటున్నారు .