సందీప్ కిషన్ తో సాయిపల్లవి....

  • IndiaGlitz, [Monday,January 16 2017]

మ‌ల‌యాల ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేమ‌మ్‌లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న ఫిదా చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పుడు మ‌రో చిత్రం చేయ‌డానికి అంగీక‌రించింద‌ని ఫిలింన‌గ‌ర్‌లో స‌మాచారం.

మ‌హేష్‌బాబు సోదరి మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిష‌న్ హీరోగా ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని స‌మాచారం.

ఫిబ్ర‌వ‌రి నుండి సెట్స్‌లోకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకు సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. జెమిని కిర‌ణ్ సినిమాను నిర్మిస్తున్నారు. అర్బ‌న్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.