ధనుష్ కి జోడీగా సాయిపల్లవి

  • IndiaGlitz, [Friday,September 29 2017]

ఫిదాలో తెలంగాణ పోరి భానుమ‌తిగా అల‌రించింది కేర‌ళ‌కుట్టి సాయిప‌ల్ల‌వి. ఆ సినిమాకి ముందు ప్రేమ‌మ్‌, క‌లి చిత్రాల‌తో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ‌కి.. త‌మిళంలో ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అక్క‌డ క్రేజ్ ఉన్న హీరోల‌లో ఒక‌రైన ధ‌నుష్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం సాయిప‌ల్ల‌వికి ద‌క్కింది.

తెలుగులో మాస్ పేరుతో అనువాద‌మైన మారి (ఇందులో కాజ‌ల్ హీరోయిన్‌) చిత్రానికి సీక్వెల్‌గా రానున్న మారి2 చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. ల‌వ్ ఫెయిల్యూర్‌, మారి చిత్రాల ద‌ర్శ‌కుడు బాలాజీ మోహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి.. ఎం.సి.ఎ చిత్రంలో నానికి జోడీగా న‌టిస్తోంది. అలాగే తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన క‌ణంతో అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ఛత్రపతికి 12 ఏళ్లు

బాహుబలి సిరీస్తో జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న కాంబినేషన్ కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు రాజమౌళిది. అయితే ఆ సినిమాల కంటే ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఛత్రపతి.

ప‌వ‌న్ చిత్రంలో ఉద‌య‌భాను?

జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌నం డైరెక్ట‌ర్ తో నాని?

శ్రియ తొలి చిత్రం ఇష్టంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ కె. కుమార్‌.. ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో తెలుగువారికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

అడివి సాయికిరణ్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండీ చిత్ర సినిమాలు

'మిస్టర్‌ పెళ్లాం', 'శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.

ఆమెని కూడా మెచ్చుకున్న థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్‌, సాయిధ‌ర‌మ్ జ‌వాన్‌తో పాటు రేపు విడుద‌ల కానున్న శ‌ర్వానంద్ మ‌హానుభావుడు చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడు.