విజయ్ దేవరకొండకు జోడీగా సాయిపల్లవి?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఫిదా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సాయిపల్లవి. ఆ తరువాత 'ఎంసీఏ' చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో శర్వానంద్‌తో 'పడిపడి లేచె మనసు' చిత్రాన్ని చేస్తున్న సాయిపల్లవి.. తమిళంలో సూర్యతో 'ఎన్.జి.కె' చిత్రాన్ని.. ధనుష్‌తో 'మారి 2' చిత్రాన్ని చేస్తున్నారు.
ఈ మూడు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. అలాగే 'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' దర్శకుడు క్రాంతి మాధవ్.. యూత్ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా సాయిపల్లవి నటించే అవకాశముందని వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments