సోలో... సో బెటర్ అంటున్న పల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
సాయి పల్లవి ఇప్పుడు సోలో బతుకే సో బెటర్ అని అంటోందా? యస్... సాయిపల్లవి ఇప్పుడు అదే రాగాన్ని అందుకుంది. అందుకు రీజన్ కూడా ఉంది. ఎందుకంటే తన పక్కన సెట్లో ఉండాల్సిన చైతన్య లేడు కాబట్టి. తన లేటెస్ట్ ఫ్లిక్ వెంకీమామ కోసం చైతన్య టూర్‌లో ఉన్నాడు. హైదరాబాద్ టు ఖమ్మం రోడ్ ట్రిప్ వెళ్తున్నాడు. సో ఇప్పుడు సాయిపల్లవి సోలోగా సీన్స్ లో యాక్ట్ చేస్తోంది. ఇంతకీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ డీటైల్స్ ఏంటో తెలుసు కదా. వీరిద్దరూ కలిసి ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.
తెలంగాణ మారుమూల పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి సెటిల్ అవుదామనుకున్న జంట కథ ఇది. అయితే వీరిద్దరూ పరిచయం అయ్యేది సిటీలోనే అట. ఈ మూవీ కోసం ఇప్పటికే పద్మారావు నగర్ పరిసరాల్లో కాలనీ సెటప్‌ని బాగానే సెట్ చేశారు శేఖర్ కమ్ముల. ఈ మూవీ కోసమే చైతన్య తెలంగాణ శ్లాంగ్ నేర్చుకున్నారు. ఆల్రెడీ డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకున్న సాయిపల్లవి మరికొన్ని గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.
సాయిపల్లవికి తెలుగులో తొలి మూవీ శేఖర్ కమ్ములతోనే. ఆ సినిమా కోసమే ఆమె తెలుగు కూడా నేర్చుకుంది. ఆ మూవీతో ఆమెకు తెలంగాణ శ్లాంగ్ పక్కాగా నేర్పిన శేఖర్, లేటెస్ట్ గా చైతూకి కూడా నేర్పిస్తున్నారు. కామ్ గోయింగ్ గై చైతూకి, అల్లరి పిల్ల సాయిపల్లవికి మధ్య ఈ మూవీలో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే 2020 వరకు ఆగాల్సిందే. అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments